ETV Bharat / state

'పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా సేవలందిస్తాం' - SP in charge Dr. Sangram Singh Patil latest news

నూతన సంవత్సర వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాదిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలదింస్తామని ఇంఛార్జ్ ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

Sangram Singh Patil wishes you a Happy New Year
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెపిన సంగ్రామ్ సింగ్ పాటిల్
author img

By

Published : Jan 1, 2021, 5:26 PM IST

నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. ఈ ఏడాదిలో నేర రహిత, ప్రమాదాల నివారణ, మహిళా భద్రత, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలందరికీ ఇంఛార్జ్ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రజా సేవలో ఉంటుంది. కరోనా వ్యాప్తి క్లిష్ట పరిస్ధితిల్లోనూ ఆందోళన చెందకుండా ముందుండి జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టి కృషి చేసింది. అదే స్పూర్తితో ఈ ఏడాదిలో మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తాం.

-డా.సంగ్రామ్ సింగ్ పాటిల్, జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ

వేడుకల్లో.. అడిషనల్ ఎస్పీ వి.శ్రీనివాసులు, ఏఆర్​ అదనపు ఎస్పీ సదానంద రెడ్డి, శిక్షణ ఐపీఎస్ సుధీర్ రామ్​నాథ్ కేకన్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ.సంపత్ రావు, బోనాల కిషన్, సీఐలు, ఎస్సైలు, డీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రజలకు మరింత చేరువై మన్ననలు పొందాలి: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.