జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ అడవుల్లో పెద్దం పేట సమీపంలో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న మావోయిస్టులు, వెంటనే ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకపోతే తగిన చర్యలు తప్పవని, ములుగు ఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ హెచ్చరించారు.
మావోయిస్టులు అమాయక గిరిజనులను వేధిస్తున్నారని.. చందాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మావోలు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన వ్యతిరేక కార్యకలాపాలకు దిగుతూ, డబ్బు కోసం పేదలను వేధిస్తే తగిన చర్యలు తీసుకొంటామని ఆయన తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి: దానం చేయండి.. అంటూ వస్తారు.. అందినవి దోచేస్తారు..