భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీనగర్ కాలనీలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నీరు, డ్రైనేజీ, రహదారి సమస్యలు ఉన్నట్లు గుర్తించామని త్వరలోనే అన్నింటికి పరిష్కారం చూపుతామని గండ్ర తెలిపారు. రాబోయే కాలంలో భూపాలపల్లిని అత్యుత్తమ నగరపాలక సంస్థగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: కిషన్ రెడ్డిని బెదిరించిన షేక్ ఇస్మాయిల్ రిమాండ్