జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఘన్పూర్, భూపాలపల్లి మండలాలకు చెందిన 37 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన రూ.7 లక్షల 89వేల విలువ గల చెక్కులను అందించారు.
![mla gandra venkataramareddy started new ambulence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_wgl_48_06_mla_ambulence_open_av1_ts10069_0609digital_1599383346_874.jpg)
నియోజకవర్గ ప్రజల తరుఫున సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, నాయకులు, గ్రంథాలయ ఛైర్మన్, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.