ETV Bharat / state

మాసు రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల మృతి చెందిన సర్పంచ్ మాసు రాజయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్​ రూరల్​ జిల్లా జెడ్పీ ఛైర్​ పర్సన్​ గండ్ర జ్యోతి పరామర్శించారు. రాజయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. తన వంతు సాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.

mla gandra venkata ramanaa reddy condolence to sarpanch rajaiah family
మాసు రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర
author img

By

Published : Sep 6, 2020, 4:33 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల మృతి చెందిన చిట్యాల సర్పంచ్​ మాసు రాజయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్​ గ్రామీణ జిల్లా జెడ్పీ ఛైర్​ పర్సన్​ గండ్ర జ్యోతి పరామర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తన వంతు సాయంగా కుటుంబ సభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. రాజయ్య జర్నలిస్టుగా పని చేసినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒకేలా గౌరవించేవారని అన్నారు.

రాజయ్య మృతి వల్ల చిట్యాల ఒక మంచి నాయకుడినే కాదు.. మంచి వ్యక్తిని కూడా కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయిన వారి కుటుంబ సభ్యులకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. రాజయ్య చికిత్స కోసం మాక్స్​కేర్​ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి మంచి వైద్యం అందించమని సిఫార్సు చేసినట్టు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. రాజయ్య విషయంలో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. రాబోయే చిట్యాల ఎన్నికల్లో అందరూర రాజయ్య కుటుంబానికి అండగా ఉండాలని, పార్టీ మద్ధతు వారికే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల పార్టీ అధ్యక్షుడు కుంభం రవీందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కామిడి రత్నాకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జంబుల తిరుపతి, స్థానిక టౌన్ ప్రెసిడెంట్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.