అసెంబ్లీ ఎన్నికల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొత్తంలో ఘనపూర్ మండలంలో అతి తక్కువ మెజార్టీ వచ్చిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతిఒక్కరు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. మండలంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో హన్మకొండలోని తన ఇల్లు అమ్మడం వల్ల తనకు నివాసం లేదని, ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఇచ్చిన ఎమ్మెల్యే భవనంలో ఉంటున్నానని తెలిపారు.
- ఇదీ చూడండి : నేడే కొలువుదీరనున్న కొత్త పాలక మండళ్లు