జయశంకర్ భూపాలపల్లి జిల్లా హనుమాన్‌నగర్‌లో తెరాస 20వ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెరాస జెండాను ఆవిష్కరించారు.
అనంతరం కాలనీవాసులకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ఇళ్లలో ఉండటమొక్కటే మార్గమని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తప్పకుండా మాస్కు ధరించాలన్నారు.