రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరా పెన్షన్ల కింద రూ. 3016 ఇవ్వడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi) గుర్తు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డితో కలిసి.. వ్యవసాయ, హార్టికల్చర్, వైద్య, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున 101 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లను(tricycles to the disabled) అందజేశారు. జిల్లాలో త్వరలో టీ డయాగ్నస్టిక్ సెంటర్(T- Diagnostic Center)తో పాటు ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్క ఉద్యోగికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారికి వేతనాలు పెంచినట్లు మంత్రి వివరించారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ శ్రీ హర్షిణీ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Encounter: మంప ఎదురుకాల్పుల్లో.. పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి