ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజి 57 గేట్లు ఎత్తివేత - medigadda water level

మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ 57 గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 11.40 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

medigadda gates open to release flood water
మేడిగడ్డ బ్యారేజి 57 గేట్లు ఎత్తివేత
author img

By

Published : Aug 12, 2020, 6:53 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు అంతా జలకళను సంతరించుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద పోటెత్తుతోంది. మొత్తం 85 గేట్లలో 57 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం వరకు 35 గేట్లు తెరిచి ఉంచగా.. బుధవారం నాటికి 57 గేట్లను ఎత్తారు. ఎగువ ప్రాంతం నుంచి 4,46,200 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. 4,30,600 క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు. ఫలితంగా 16.17 టీఎంసీల సామర్థ్యమున్న మేడిగడ్డ బ్యారేజిలో ప్రస్తుతం 11.40 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. పోటీపడుతున్నట్లు పరవళ్లు తొక్కుతున్నాయి. వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తుంది.

మేడిగడ్డ బ్యారేజి 57 గేట్లు ఎత్తివేత

ఇవీచూడండి: ఎత్తిపోతల ఫలితం.. పెరిగిన మధ్యమానేరు నీటి నిల్వ సామర్థ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.