కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ బ్యారెజీ గేట్లను ఇంజినీరింగ్ అధికారులు ఇవాళ ఉదయం ఎత్తివేశారు. కన్నపల్లి పంప్ హౌస్లో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో మెడిగడ్డ బ్యారెజీ వద్ద నీటి మట్టం పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్యారెజీలో 96.6 మీటర్ల, 7.256 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ మేరకు 38,39,40,41,42,43 గేట్లను అర మీటర్ వరకు ఎత్తారు. 12,600 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వదిలారు.
ఇదీ చూడండి : అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్