ETV Bharat / state

వైద్య పరికరాలు వెంటనే కొనుగోలు చేయాలి : కలెక్టర్​ - corona meeting bhupalpally

భూపాలపల్లి జిల్లాలో కరోనా వైరస్​ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలెక్టర్ అత్యవసర కలెక్టర్ సమావేశం నిర్వహించారు. వెంటనే వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కలెక్టర్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు.

Medical equipment should be purchased immediately bhupalpally district Collector command
వైద్య పరికరాలు వెంటనే కొనుగోలు చేయాలి : కలెక్టర్​ ఆదేశం
author img

By

Published : Apr 9, 2020, 12:52 AM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా అధికారులతో కలెక్టర్ అబ్దుల్ అజీం సమీక్ష నిర్వహించారు. ఐసోలేషన్, ఐసీయూ వార్డుల్లో అత్యవసర వైద్య పరికరాలు వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కరోనా అనుమానితులకు జిల్లాలో రెండు ఐసోలేషన్, ఒక ఐసీయూ కేంద్రాల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మందులు, కోవిడ్ కిట్స్, వెంటిలేటర్లు, డిజిటల్ థర్మ మీటర్లు, శానిటైజర్లు, స్టాండ్స్, వీల్ చైర్స్, క్వరంటైన్ కావాలన్నారు.

రోజూ ఉపయోగించే డిస్పోజల్ వస్తువులు, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కోసం ఉపయోగించే మాస్కులు, యూనిఫామ్స్ యుద్ధ ప్రాతిపదికన ఈ-టెండర్ పద్ధతిలో కొనుగోలు చేయాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాల సభ్యులతో 15వేల మాస్క్​లను సిద్ధం చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజా విక్రమ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సుమతి, కలెక్టర్ కార్యాలయం ఏవో మహేష్ బాబు, కరోనా వైరస్ నియంత్రణ జిల్లా కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ మమత, డాక్టర్ జైపాల్, డాక్టర్ ఉమా, డాక్టర్ రవి టీఎస్ఎమ్ఐడీసీ ఈఈ నరసింహులు, వైద్యవిధాన పరిషత్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.