ETV Bharat / state

పంబాపూర్​లో మావోల గోడపత్రిక.. ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిక

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. పంబాపూర్​ గ్రామ సర్పంచ్​కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ కరపత్రాలు వెలిశాయి. మావోల కదలికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Maoist letter at Pambapur in bhupalapalli district
పంబాపూర్​లో మావోల గోడపత్రిక.. ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
author img

By

Published : Oct 19, 2020, 10:06 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు మరోసారి కలకలం రేపాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామ సర్పంచ్ బంటు రమేష్​కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ.. గ్రామ సమీపంలో ఓ గోడకు మావోల లేఖ వెలిసింది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఏరియా కమిటీ పేరు మీద కరపత్రాలు వెలువడ్డాయి.

గ్రామాల్లో ప్రజాప్రతినిధుల అరాచకాలు పెరిగాయి. గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ బంటు రమేష్​కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. 8 ఏళ్ల క్రితం బోర్లగూడెంలో వెంకటేశ్వరరావుకు పట్టిన గతే నలుగురుకి పడుతుంది.

- మావోయిస్టు గోడ పత్రికలో

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను సైతం మావోలు తమ లేఖలో పేర్కొనడం కొసమెరుపు.

ఇదీ చూడండి: గుడ్డు కూర పెట్టలేదని మిత్రుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.