ETV Bharat / state

'మహిళల సమాన అవకాశాల కోసం పూలే కృషి ఎనలేనిది'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. మహిళల సమాన అవకాశాల కోసం పూలే ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు.

mahatma jyotiba phule birth anniversary, mahatma jyotiba phule birth anniversary jayashankar bhupalpally collectorate
జ్యోతిబాపూలే జయంతి వేడుకలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూలే జయంతి
author img

By

Published : Apr 11, 2021, 5:23 PM IST

అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిబా పూలే విశేష కృషి చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీల అభివృద్ధి అధికారి శైలజ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. అధికారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళల సమాన అవకాశాల కోసం పూలే ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పూలే అని బీసీ సంక్షేమసంఘం నాయకుడు సత్యనారాయణ అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యం.మొగిలి, వసతి గృహ సంక్షేమ అధికారులు ఎం.మల్లయ్య, ఎన్. పైడి, ఎన్. ఎల్లస్వామి, ఆర్.శారద, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేటీఆర్ వచ్చే వేళాయే.. సుందరంగా ముస్తాబవుతోన్న వరంగల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.