జయంశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో నీరంతా బయటకి వెళ్లిపోగా బోసిపోయి ఖాళీగా కనిపిస్తోంది. గతేడాది కురిసిన వర్షాలకు మేడారం మహా జాతర అవసరాలతో పాటు రెండు పంటలు పూర్తి స్థాయిలో పండుతాయని అందరూ ఆశించారు.
నీటిని రొటేషన్ ప్రకారం ఇవ్వాల్సిన మేరకే యాసంగి సాగుకు నీటిపారుదలశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. వివిధ కారణాల వల్ల ఇప్పుడు జలాశయం మొత్తం ఖాళీ అయిపోయింది. నీటిని పొదుపుగా ఉపయోగించుకోకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో లక్నవరం జలాశయాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- ఇదీ చూడండి: విమానాలను ధ్వంసం చేసే లేజర్ అమెరికా సొంతం!