జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేటలో... జిల్లెడు చెట్లపై మిడతలు వాలడం కలకలం రేపింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు ఇలాంటి మిడతలు చూడలేదని వారు తెలిపారు.
సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు... పరిశీలించి స్థానిక మిడతలని తేల్చారు. ఫొటోలను శాస్త్రవేత్తలకు పంపించగా... వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని వారు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'