భానుడి ఎండ తీవ్రతకు ముఖం వాల్చేసిన చెట్టూ చేమా తొలకరి జల్లుల మట్టి వాసనకు సరికొత్త చైతన్యంతో చివుళ్లు తొడుగుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం రోజు రోజుకు కొత్త రూపును సంతరించుకుంటోంది.
వరద నీటితో జలాశయానికి జల కళ వస్తుండగా పరిసర ప్రాంతాలు పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయి. అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. లక్నవరం జలాశయంలో గురువారం ఉదయానికి 15 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.
ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!