జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా రాంపూర్ అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన ఖమ్మం సహాయ కార్మిక శాఖ అధికారి మోకు ఆనంద్‌రెడ్డి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పరకాలకు తరలించారు. ఉదయం ఘటనా స్థలానికి హన్మకొండ, భూపాలపల్లి పోలీసులు చేరుకున్నారు. అయితే నాలుగు రోజుల క్రితమే హత్య జరగడం, మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండడం వల్ల తరలించేందుకు ఇబ్బందులు పడ్డారు.
ప్రదీప్ రెడ్డితో గల ఆర్థిక లావాదేవీల వల్లే హత్య చేశారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన తరువాత మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఆనందరెడ్డి హత్య.. కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇటు పరారైన ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య