దారుణ హత్యకు గురైన ఖమ్మం కార్మిక శాఖ సహాయ అధికారి మోకు ఆనంద్‌రెడ్డి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఉదయమే సంఘటనా స్థలానికి చేరుకున్న హన్మకొండ, భూపాలపల్లి పోలీసులు అటవీ ప్రాంతం నుంచి మృతదేహాన్ని తరలించేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు.
నాలుగు రోజుల క్రితమే హత్య జరగడం వల్ల మృతదేహం బాగా కుళ్లిపోయింది. ముందుగా పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిద్దామని అనుకున్నా... ఆఖరి నిమిషంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారుు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమైనా... ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య