ETV Bharat / state

కాళేశ్వరం నుంచి గోదావరి పరుగులు - medigadda

తెలంగాణ వరప్రదాయినిగా పిలుచుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్క మోటారు నుంచి అధికారులు నీళ్లు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని కన్నేపల్లి పంప్‌ హౌజ్‌లో బుధవారం రాత్రి నాలుగో మోటర్‌ను ప్రారంభించారు.

కాళేశ్వరం నుంచి గోదావరి పరుగులు
author img

By

Published : Jul 11, 2019, 1:23 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకొక్క మహోన్నతమైన ఘట్టాలు ఆవిష్కృతమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజి ద్వారా నీటిని నిల్వ చేసి కన్నేపల్లి పంపుహౌస్ వద్ద మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజిలో 85 గేట్లకు గాను 70 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. మేడిగడ్డలో 91.6 మీటర్ల మేర నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటి వరద ప్రవాహం బట్టి మరిన్ని గేట్లు మూసివేస్తామని అధికారులు తెలుపుతున్నారు. అధికారులు కన్నేపల్లి పంపుహౌస్ లో 1,3, 6 వ నంబర్ మోటార్ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. బుధవారం రాత్రి నాలుగో మోటారును ప్రారంభించారు. ఆ తరువాత మోటార్లు పనిచేస్తున్న తీరును,నీటిని ఎత్తిపోస్తున్న పరిస్థితుల పై ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు పరిశీలించారు. కన్నేపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోస్తున్న అన్నారం బ్యారేజీకి చేరుతోంది. కన్నేపల్లి పంప్‌హౌస్‌లోని మరిన్ని మోటర్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాళేశ్వరం నుంచి గోదావరి పరుగులు

ఇవీ చూడండి: నిండుకుండలా మేడిగడ్డ... అన్నారంకు గోదారమ్మ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.