ETV Bharat / state

కన్నెపల్లి పంపుహౌస్​లో ఐదో పంపు ప్రారంభం

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు కన్నెపల్లి పంపుహౌస్​లో ఐదో పంపు ప్రారంభమైంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మాహాదేవ్​పూర్​ మండలంలో ప్రాజెక్టు నిర్మాణాల వద్ద జలకళ సంతరించుకుంది.

kannepalli pump house fifth pump run to day
author img

By

Published : Jul 15, 2019, 10:01 AM IST

కన్నెపల్లి పంపుహౌస్​లో ఐదో పంపు ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్​ ఈరోజు ఒకటవ పంపును ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు రన్​ చేయడం వల్ల జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాదేవ్​పూర్​ మండలంలో జల కళ సంతరించుకుంది. ఇప్పటికే ప్రారంభించిన 3,4,5,6 పంపుల ద్వారా ఏకధాటిగా జలధార పరుగులు తీస్తూ గ్రావిటీ ద్వారా అన్నారం బ్యారేజీ గోదావరిలో కలిసిపోయాయి. ఒక్కపంపు 24 గంటలకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తోందని ఇంజినీర్లు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు మూసివేయడం వల్ల ప్రవాహం ఎదురొస్తూ కాళేశ్వరం ఎగువకు చేరింది. మేడిగడ్డ నుంచి 6 టీఎంసీల నీటి నిల్వతో 11 వేల క్యూసెక్కులుగా కన్నెపల్లి పంపుహౌస్​ వద్దకు చేరింది.

TG_WGL_66_15_FIFTH PUMP RUN_AV_G3 రిపోర్టర్ : టి.శశాంక్ సెంటర్ : మహాదేవపూర్ జిల్లా : భూపాలపల్లి సెల్ నంబర్ : 9676766098, 800855788 కన్నేపల్లి పంపుహౌస్ లో ఐదో పంపు ప్రారంభం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ల వద్ద జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని భారీ బ్యారేజి మేడిగడ్డ వద్ద నీటి నిల్వ క్రమక్రమంగా పెరుగుతు వస్తుంది. ఆదివారం సాయంత్రం వరకు 6.3 టీఎంసీల నీటి నిల్వ అవ్వగా బ్యాక్ వాటర్ నది గర్భంలోనే పెరుగుతు సాగుతుంది. మేడిగడ్డలో 96.1 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉంది. అదే విధంగా కన్నేపల్లి పంపుహౌస్ పంపుల్లో మరో పంపును కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లు ,సంస్థ ప్రతినిధులు ఆదివారం తెల్లవారుజామున రన్ చేయగా వీటితో పాటు ఇదివరకే పనిచెస్తున్న మూడు పంపులు జతకట్టి వరుసగా నాల్గు పంపులు నిరాటకంగా సాగాయి. ఆదివారం 3,4,5,6 పంపులు పనిచేయగా 8 పైపుల నుంచి జలాలు గ్రావిటీ కాలువలో ఎత్తిపోసాయి.ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్ సీ నల్లా వేంకటేశ్వర్లు ఆద్వర్యంలో ఇదివరకే పనిచేసిన 1 వ పంపును సాయంత్రం 5 గంటలకు తిరిగి ప్రారంభించగా 5 పంపులు ,10 పైపుల ద్వారా ఏకదాటిగా జలాలు ఎత్తిపోశాయి. దీంతో జలాలు ఉరుకలు,పరుగులతో గ్రావిటి వెంట అన్నారం బ్యారేజి గోదావరిలో కలిసిపోయాయి. ఒక్క పంపు 24 గంటలకు 2 టీఎంసీని (2300 క్యూసెక్కులు) గ్రావిటీ పోస్తుందని ఇంజనీర్ల లెక్కల చెబుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజి 85 గేట్లు మూసివేయడంతో ప్రవాహం ఎదురొస్తు కాళేశ్వరానికి ఎగువకు చేరాయి. సుమారు 27 కిలోమీటర్ల మేర ప్రవాహం చేరుకుంది. మేడిగడ్డ నుంచి వెనక్కి ప్రవాహం రావడంతో 6 టీఎంసీల నీటి నిల్వతో 11000 వేల క్యూసెక్కులుగా కన్నేపల్లి పంపుహౌస్ వద్ద నమోదయ్యింది. కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం వద్ద ఉభయ నదుల నీటి మట్టం 4.10 మీటర్లతో కల్గి ఉంది. అన్నారం బ్యారెజీ వద్ద గోదావరి ప్రవాహం 4 టీఎంసీలతో ,9 వేల క్యూసెక్కుల ప్రవాహంతో నిండుగా ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.