ధరణి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అన్నారు. చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి సర్వీసుల గురించి సమీక్ష నిర్వహించారు. జాప్యానికి తావివ్వకుండా ధరణి దరఖాస్తులను పరిశీలించి త్వరగా పట్టాదారు పాసు పుస్తకాలను అందించాలని తహసీల్దార్ షరీఫ్‌ని ఆదేశించారు.
లబ్దిదారులకు పాసుపుస్తకం కాఫీ అందజేశారు. ధరణి విధానం వల్ల రైతులకు అరగంటలోపే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కంప్లీట్ చేసి పాసుపుస్తకం అందజేస్తామని తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: 'సన్నాల సాగుకు రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది'