తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పరిశీలించారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. మహారాష్ట్రలో కరోన ఉద్ధృతి కారణంగా ఒక్కరిని కూడా రాష్ట్రంలోకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారెజీపై రాకపోకలు నిషేధంపై పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మహదేవపూర్ మండలంలో ఎక్కిడిక్కడే చెక్ పోస్టులు పెట్టి భద్రత కట్టుదిట్టం చేశారు. లాక్డౌన్ దృష్ట్యా తెలంగాణ, మహారాష్ట్రకు రాకపోకలు నిషేధించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెనపై రాకపోకలు సాగడం లేదు. ఆయా వంతెనల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.