ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తివేత

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నందున గ్రావిటీ ద్వారా ఎత్తి పోతలను నిలిపేశారు. వరదనీటితో జలశయం నిండు కుండను తలపిస్తోంది.

author img

By

Published : Aug 2, 2019, 10:37 AM IST

మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తివేత.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లను ఇంజినీరింగ్ అధికారులు తెరిచి ఉంచారు. బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజిలోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నందు వల్ల వాటిని దిగువకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ వద్ద 6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కన్నెపల్లి పంపు హౌస్​లోని పంపులు గురువారం నాడు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో బ్యారేజీలు, జలాశయాల వద్ద నీరు సమృద్ధిగా ఉండడం వల్ల మంగళవారం నుంచి పంపులను నిలిపివేసి గ్రావిటీ ద్వారా జలాల ఎత్తిపోతలను ఆపేశారు. ఇప్పటికీ కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 6, అన్నారం బ్యారేజీ వద్ద 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

మేడిగడ్డ బ్యారేజి వద్ద 65 గేట్లు ఎత్తివేత.

ఇదీ చూడండి: నదులు గలగల... జలాశయాలకు జలకళ

TG_WGL_66_01_MEDIGADDA GATES OPEN_AV_G3 రిపోర్టర్ : టి.శశాంక్ సెంటర్ : మహాదేవపూర్ జిల్లా : భూపాలపల్లి సెల్ నంబర్ : 9676766098, 800855788 మెడిగడ్డ బ్యారెజి గేట్ల ఎత్తివేత. కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ బ్యారెజి గేట్లను ఇంజనీరింగ్ అధికారులు ఎత్తి ఉంచారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. మరో వైపు గోదావరి, ప్రాణహిత నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. గురువారం 65 గేట్లు తెరిచి ఉంచారు. వరుస క్రమంలోని 12 నుంచి 77 వరకు గేట్లను ఎతారు. ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తూండడంతో అవుట్ ఫ్లో 4 లక్షల క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ వద్ద 6.0 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి పంపు హౌస్ పంపు లు గురువారం కూడా నిలిచిపోయాయి. వరుస భారీ వర్షాలతో బ్యారేజీలు, జలాశయాల వద్ద నీరు సమృద్ధి గా ఉండడంతో మంగళవారం నుండి పంపులను నిలిపివేయడంతో గ్రావిటీలో జలాల ఎత్తి పోయడం లేదు. కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద 6 టీఎంసీలు, అన్నారం బ్యారేజీ వద్ద 8 టీఎంసీ నీటి నిల్వ ఉంది. భారీగా నిల్వలతో ప్రాజెక్ట్ ప్రాంతాల్లో జలకళలాడుతున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.