ETV Bharat / state

బోరుబావులు ఎండిపాయే.. పంట పశువుల పాలాయే.! - Wells and boreholes are drying up in many villages of Malhar zone before the onset of summer

వేసవి సమీపించకముందే బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు.. వేసిన పంటతోనే ఎండిపోయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలంలోని వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

paddy farmers, malhar mandal
మల్హర్​లో ఎండిన బోరుబావులు
author img

By

Published : Mar 31, 2021, 10:39 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎండాకాలం ప్రారంభం కాకముందే బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. గోదావరి నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా.. తీగల వాగు ప్రాజెక్టుకు గండి పడి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు వరి పంటపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. సుమారు 500 ఫీట్లు బోర్లు వేసినా కానీ చుక్కనీరు కానరావడం లేదు.

పంట చేతికందుతుందనుకుంటే..

మరో నెల రోజుల్లో పంట చేతికి అందుతుందనుకున్న సమయంలో బోరుబావులు ఎండిపోతుండడంతో కొన్ని వందల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. లక్షల రూపాయల్లో పెట్టుబడులు పెట్టిన రైతులు.. చేసేదేమీ లేక పొలాల్లో పశువులను మేపుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తీసుకున్న భూమికి కౌలు, పంట పెట్టుబడి తీర్చే మార్గం కానరాక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు.

సాయం కోసం ఎదురుచూపు..

మండలంలోని అడ్వాలపల్లి, పెద్దతూండ్ల గ్రామంలోని సుమారు 30 మంది రైతులకు చెందిన వందల ఎకరాల వరి పంట ఇప్పటికే ఎండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం సర్వే నిర్వహించి.. ఎండిపోయిన వరి పొలాల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ముప్పు ఉన్న వారందరికీ టీకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.