ఐదేళ్లలోపు పిల్లల వయసుకు తగ్గ ఎత్తు పెరిగేలా పౌష్టికాహారం అందించాలని స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మెనూ ప్రకారం చిన్నారులకు ఆహారం అందించేలా చూడాలన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.
ఐసీడీఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్ల సమన్వయంతో జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల్ని ముఖ్యంగా వలస కార్మికుల, ఇటుక బట్టీల ప్రాంతాల్లో ఉండే బాలల వివరాలు సేకరించాలన్నారు. ఎత్తు కొలిచి వయసుకు తగ్గట్టుగా లేని వారిని గుర్తించి పౌష్టికాహారం అందించి ఆరోగ్యంగా పెరిగేలా చూడాలని పేర్కొన్నారు.
మెనూ ప్రకారం..
ప్రతి అంగన్వాడీ సూపర్వైజర్ తప్పకుండా వారి పరిధిలోని కేంద్రాలను పరిశీలించి చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ భవనాలు, మానవ వనరుల వివరాలు అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవిని ఆదేశించారు.
మల్హర్రావు, మహాముత్తారం, మహాదేవపూర్, పలివెల మండలాల్లోని అంగన్వాడీ సూపర్వైజర్లకు ప్రయాణానికి స్కూటీలు అందించే ఏర్పాటు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి, మహాదేవపూర్ సీడీపీవోలు అవంతి, రాధిక, పోషన్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ యోచన పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్