విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరు.. గండ్ర ఆగ్రహం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామానికి అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని.. అందరు కలిసికట్టుగా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ నిధి కింద 12 మంది లబ్ధిదారులకు 2 లక్షల 73 వేల చెక్కుల పంపిణీ చేశారు. ఘనపురం మండలంలోని పలు గ్రామాల్లో 7 కోట్ల 24 లక్షలతో నిర్మించే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఘనపురం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే గండ్ర ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా పట్టించుకోకపోవడం ఏంటని మండిపడ్డారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండ చూసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!