జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్లో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఛైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని అధ్యక్షతన జరిగింది. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాకాలంలో వాహనదారులకు ఇబ్బంది కల్గకుండా రోడ్ల మరమ్మతు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం చేసేలా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు, ఎరువులు జిల్లాలో లేకుండా చూడాలని ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలని తెలిపారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.