జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు. ఇస్సిపేట, పర్లపల్లి, వేములపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలకు బియ్యం, నగదును ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. లాక్ డౌన్ క్లిష్టం సమయంలో కరోనాపై అవగాహన కల్పించి, నివారణ చర్యలను తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సదయ్య, ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్వర రావు, తహసీల్దార్ రాణి, ఎంపీడీవో రామయ్య, ఏవో రఘుపతి, సొసైటీ సీఈఓ సాగర్, తెరాస మండల అధ్యక్షుడు తిరుపతి రావు, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా.. 33వేలు దాటిన మృతులు