జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా.. ఆబ్కారీ శాఖ అధికారుల సాయంతో అధిక ధరలు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి నాయకుడు హరీశ్ రెడ్డి ఆరోపించారు. వ్యాపారులంతా సిండికేట్ అయి..మద్యాన్ని అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా ఆబ్కారీ అధికారులు.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
లాక్డౌన్ సమయంలోనూ.. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరుపుతున్నారని హరీశ్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. లేనియెడల కలెక్టర్కు ఫిర్యాదు చేసి.. ఆయన ఆదేశాలతో బెల్డ్ షాపులపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.
- ఇదీ చదవండి- టీకా తీసుకున్నాం.. సేఫ్గా ఏమేం పనులు చేయొచ్చు?