ETV Bharat / state

KALESHWARAM: కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద... మేడిగడ్డ బ్యారేజి గేట్లు ఎత్తివేత

author img

By

Published : Sep 27, 2021, 7:29 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గులాబ్‌ తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో మహదేవపూర్ మండల పరిధిలోని బ్యారేజీల గేట్లు ఎత్తి... నీటిని దిగువకు పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు

గులాబ్‌ తుపాను ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలకు వరద తాకిడి పెరుగుతోంది. దీంతో బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లక్ష్మీ బ్యారేజికి(మేడిగడ్డ) 5,10,230 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 79 గేట్లు ఎత్తి 5,98,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సరస్వతి బ్యారేజికి (అన్నారం) 4,58,000 క్యూసెక్కుల ప్రవాహం రాగా 59 గేట్లు తెరిచి... 0.47 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గించినట్లు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరుదనీరు వస్తుండటంతో... వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నామని అధికారులు తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజి గేట్లు ఎత్తివేత

భూపాలపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గులాబ్‌ తుపాను ప్రభావం కొనసాగుతోంది. మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం, కాటారం, కాళేశ్వరం ప్రాంతంల్లో సోమవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

ఇదీ చదవండి: Gulab Cyclone Effect on Telangana: రాష్ట్రంలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.