జయశంకర్ భూపాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. ఓటింగ్ సరళి చూస్తుంటే మార్పు తప్పనిసరిగా వస్తుందని అభిప్రాయపడ్డారు. పోలింగ్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్న ఈసీని ప్రశంసించారు.
ఇదీ చదవండి : సతీసమేతంగా జక్కన్న ఓటు వినియోగం