జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పందిపంపుల, కుందురుపల్లి గ్రామాల్లోని గుత్తికోయల కుటుంబాలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు నిత్యావసరాలు అందజేశారు. పేదప్రజలను ఆదుకోవడానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాంనేనీ రవీందర్, అంబాల శ్రీను, సర్పంచ్ మధువంశీ, మాజీ సర్పంచ్ తోట సంతోష్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సత్యనారాయణ కోరారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.