ETV Bharat / state

ధాన్యం డబ్బుల కోసం.. రైతుల ఆందోళన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయం ముందు ధాన్యం సొమ్ము కోసం రైతులు ధర్నా నిర్వహించి వ్యవసాయకమిటీ చైర్మన్​ను, అధికారులను నిలదీశారు. గత ఐదు రోజులుగా అధికారులు రైతుల సొమ్ముపై విచారణ చేస్తున్నకొద్ది అవకతవకలు బయటపడుతున్నాయని.. తమ ధాన్యం కొనుగోలు చేసిన సొమ్ము వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Formers Protest in Jayashankaar Bhupalapally
ధాన్యం సొమ్ము కోసం.. రైతుల ఆందోళన
author img

By

Published : Sep 24, 2020, 8:31 PM IST

కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని.. డిమాండ్​ చేస్తూ.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలం తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని తరుగు పేరుతో కోత విధించడం అన్యాయమని.. ఆ సొమ్మును వెంటనే చెల్లించాలంటూ రుద్రారం, తాడిచెర్ల గ్రామాలకు చెందిన 100 మంది రైతులు గురువారం తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దాదాపు నాలుగు గంటల పాటు రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దండు రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితెల రాజయ్య రైతుల ధర్నాకు మద్దతు ప్రకటించారు.

నిబంధనలు పాటించలేదు..
రైతుల సొమ్ము అక్రమంగా స్వాహా చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సిబ్బంది, బినామీలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వారి వద్ద రైతుల సొమ్మును రికవరీ చేయాలని.. ఇందుకు వ్యవసాయ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ రామారావు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్తాకు 40 కిలోల 700 గ్రాములు తూకం వేయాలనే నిబంధనలు తుంగలో తొక్కి బస్తాకు 42 కిలోల చొప్పున తూకం వేసుకుని అదనంగా తరుగు పేరుతో మరో ఐదు కిలోలు దోచుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంమై ఛైర్మన్ రామారావు వాహనాన్ని అడ్డుకుని నిలదీయగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు నష్టపోకుండా..
అందరి ట్రక్ షీట్ పరిశీలన చేసి ఐదు రోజుల్లో అందులో ఉన్న ధాన్యం కంటే సిబ్బంది అదనంగా కోత విధించినట్లు తేలితే ప్రతి రైతుకు రూపాయి కూడా నష్టపోకుండా ధాన్యం సొమ్మును అందజేస్తామని భూపాలపల్లి డీసీఓ సీనియర్ ఇన్​స్పెక్టర్ వేణుగోపాల్ హామీ ఇచ్చిన తర్వాత రైతులు ఆందోళన విరమించారు.

చెక్కులు అందించిన అధికారులు
గతంలో రుద్రారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మి 50 శాతం సొమ్ము ఇంకా రాని 20 మంది రైతులకు చెందిన రూ.7.20 లక్షల చెక్కులను సీనియర్ ఇన్​స్పెక్టర్ వేణుగోపాల్ అందజేశారు. రుద్రారం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు తోట మధుకర్, అతని బినామీలైన 13 మంది ఖాతాల్లో రైతులకు చెందిన సొమ్ము భారీగా చేరినట్లు విచారణలో తేలింది. ఇందుకు పూర్తి బాధ్యత కార్యనిర్వాహణ అధికారి శ్రీకాంత్ వహించాలని వేణుగోపాల్ ఆదేశించారు. రైతుల సొమ్ము గోల్​మాల్​పై పూర్తి నివేదిక రూపొందించి అక్రమాలకు పాల్పడిన సీఈవోతో పాటు సిబ్బందిపై త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ మల్క ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, వొన్న తిరుపతి రావు, రైతులు, అధికారులు, పాల్గొన్నారు.

ఇవీచూడండి: డ్రగ్స్​: వ్యసనం.. వ్యాపారం.. అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.