కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో తొలి, భారీ నిర్మాణం లక్మి బ్యారేజీ నీటితో కళకళలాడుతోంది. తొలిసారిగా ఏకకాలంలో 11 మోటార్లతో 2టీఎంసీల నీటినీ ఎత్తి పోసే మహా ఘట్టాన్ని ఆవిష్కరించారు. లక్ష్మి బ్యారేజీలో పూర్తి స్థాయి గేట్లు మూసివేయడం... పూర్తిస్థాయి నీటి నిల్వ చేయడం మొదటి సారిగా జరిగింది.
15.90 టీఎంసీలకు నీళ్లు....
గతేడాది నవంబర్ 21 నుంచి పూర్తి స్థాయిలో గేట్లను మూసేశారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... 15.90 టీఎంసీలకు చేరుకుంది. ఏడు మోటార్లు నడిపించి 14 పైపులతో గ్రావిటీ కాలువ ద్వారా జలాలలను ఎత్తిపోశారు. ఒక్కొ పంపును ప్రారంభించి ఒక్కొక్కటిగా పెంచుతూ... 11 పంపులను నడిపించారు. లక్షి పంపుహౌస్‌లో మొదటి దఫాలో 24 రోజులు, రెండో దఫాలో 39 రోజులు పంపులు నడవగా 37 టీఎంసీల నీటిని తరలించారు.
గృహాలకు స్థల పరిశీలన...
కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్ఈ రమణరెడ్డి, ప్రకాష్, మెగా సంస్థ ప్రతినిధులు జనార్దన్, వినోద్ ఉన్నారు. ఆనకట్టలు, పంప్‌హౌస్ వద్ద శాశ్వతంగా ఇంజినీర్లు ఉండానికి వసతి, తదితర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించగా... లక్ష్మి బ్యారేజీ వద్ద గృహాల కోసం స్థలాలు పరిశీలించారు.
ఇవీ చూడండి:శంషాబాద్‌లో 1100 గ్రాముల బంగారం పట్టివేత