భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో కరోనా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించింది. గ్రామంలో మాస్కులు పంచి ప్రజలకు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు సదిరం రాజు కుమార్ ఆశా వర్కర్లుగా సేవలందిస్తున్న పద్మ, భాగ్య, సుజాత, మౌనికలకు శాలువాలు కప్పి సన్మానించారు.
కరోనా సమయంలో ప్రాణలు సైతం లెక్క చేయకుండా పని చేసిన వారి సేవలు వెలకట్టలేనివని ఎంపీటీసీ శ్రీధర్ సిబ్బంది సేవలను కొనియాడారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా.. వైద్య సిబ్బంది ధైర్యంగా సేవలందిస్తున్నదని.. వారికి రక్షణ కిట్లు అందించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని విద్యార్థి సంఘం అధ్యక్షులు రాజు కుమార్ అన్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ.. చైతన్యం నింపుతున్న ఆశావర్కర్ల సేవలకు అందరూ రుణపడే ఉంటామని పలువురు ఆభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిపెల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కర్ణ, కన్నమ్ వంశీ, చిర్రా శ్రీను, తూముల సుధాకర్, కొండమల్ల శివ, చేరాలు, దూలం దేవేందర్, అంతుకురి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు