జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి రైతులు ధర్నా చేశారు. తమ వరి పొలాలు ఎండిపోతున్నాయని... కెనాల్ ద్వారా నీరందించి అన్నదాతలను ఆదుకోవాలని భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. కాలువ ద్వారా నీటిని రాకుండా చేస్తున్నారని... ఫలితంగా చేతికి వచ్చిన వరి పంట ఎండి పోతుందని వాపోయారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి రేగొండ పోలీసులు చేరుకున్నారు. రైతులకు తక్షణమే కాలువ ద్వారా నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఇదీ చదవండి: సన్నరకం సాగుతో సగం దిగుబడి నష్టపోయాం: రైతులు