ETV Bharat / state

రైతాగ్రహం: ధాన్యం అమ్మితే.. చెల్లని చెక్కులిచ్చారని ఆందోళన

ధాన్యం సొమ్ము గోల్​మాల్​పై భూపాలపల్లి డీసీఓ సీనియర్ ఇన్స్ పెక్టర్ వారం రోజుల క్రితం విచారణ చేపట్టి... ముప్పై మంది బాధిత రైతులకు చెక్కులు ఇప్పించారు. ఇటీవల చెక్కులు డ్రా చేసుకోవడానికి బ్యాంకు వద్దకు వెళ్తే... సంబంధిత ఖాతాలో నయా పైసా కూడా లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jayashankar Bhupalpally District Tadicharla Mandal
పనికిరాని చెక్కులు ఇచ్చారంటూ రైతుల ఆగ్రహం
author img

By

Published : Oct 7, 2020, 8:44 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్ల మండలం రుద్రారం, తాడిచర్ల, గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్మిన సొమ్మును పీఏసీఎస్ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వహకుడు స్వాహా చేసిన విషయం తెలిసిందే.

ధాన్యం సొమ్ము గోల్​మాల్​పై భూపాలపల్లి డీసీఓ సీనియర్ ఇన్స్పెక్టర్ వారం రోజుల క్రితం విచారణ చేపట్టి ముప్పై మంది బాధిత రైతులకు చెక్కులు ఇప్పించారు. బాధిత రైతులు ఇటీవల చెక్కులు డ్రా చేసుకోవడానికి బ్యాంకు వద్దకు వెళ్తే సంబంధిత ఖాతాలో నయా పైసా కూడా లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో రైతులు లబోదిబోమంటూ మోసపోయామని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.

బాదిత రైతులకు పనికి రాని చెక్కులు ఇవ్వడంపై అధికారులను నిలదీయగా రైతులు అధైర్య పడవద్దని సొమ్ము స్వాహా చేసిన వారు చెల్లించకుంటే సొసైటీ నుంచి 6వ తేదీ వరకు చెల్లిస్తామని అధికారులు అన్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా ధాన్యం సొమ్ము చెల్లించక పోవడం కొసమెరుపు.

ధాన్యం సొమ్ము చెల్లిస్తామని అధికారులు ఇచ్చిన హామీతో మంగళవారం ముప్పై మంది రైతులు డమ్మి చెక్కులతో తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయానికి తరలివచ్చారు. సాయంత్రం వరకు భూపాలపల్లి డీసీవో సీనియర్ ఇన్స్పెక్టర్, సిబ్బంది సుదీర్ఘ సమాలోచన తర్వాత ఈ నెల పన్నెండున సొమ్ము చెల్లిస్తామని హామీఇచ్చారు. అయినా కూడా రైతులు వినకుండా.. నమ్మకం లేదంటూ డమ్మి చెక్కులతో పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి అధికారులపై మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'తొందరపడి అమ్ముకోవద్దు... మొత్తం మేమే కొంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.