ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్ల యజమానులు రైతులను దోచుకుంటున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ రావు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెలరోజులైనా కాంటాలు వేయడం లేదని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులందించే ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు దరకే కొనుగోలు చేయాలని కోరారు.