భూ తగాదాలో తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, న్యాయం చేయాలని కోరుతూ రైతు మొకిరాల సుధాకర్ రావు దీక్ష చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లిలోని తన పొలంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
నవాబుపేట శివారులోని తన వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటుండగా బంధువు ఫిర్యాదుతో పోలీసులు తనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. సుధాకర్ రావు తన భూమిలో సాగు చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మోహన్ రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు వివరించారు.
ఇదీ చదవండి: ‘పంట తెగుళ్ల నివారణ కోసం క్రాప్ దర్పణ్’ యాప్!