జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ విత్తనాల గుట్టు రట్టయింది. వరంగల్ నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఓ కారులో నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు సీసీఎస్, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గణపురం మండలం చెల్పూర్ జంక్షన్ వద్ద కారును తనిఖీ చేయగా రెండు గోనె సంచుల్లోని 70కేజీల లూజ్ పత్తి విత్తనాలు కనిపించాయి. వాటిని వ్యవసాయ అధికారి పరిశీలించి నకిలీ విత్తనాలని ధృవీకరించారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించగా నకిలీ విత్తనాల బండారం బయటపడింది.
ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.10 లక్షల విలువైన 5క్వింటాల నకిలీ విత్తనాలతోపాటు కారు, 5 చరవాణులు, 35 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా, సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో నకిలీ పత్తి విత్తనాలను రైతులకు కట్టాబెట్టాలని చూసిన ముఠా గుట్టు రట్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ తెలిపారు.
ఇవీ చూడండి: రూ. 10 లక్షల విలువైన ఇసుక సీజ్ చేసిన అధికారులు