మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సాయంతో తండ్రి అంతక్రియలకు తనయుడు హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనికి చెందిన బండారి వెంకటేశ్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. అనారోగ్యంతో వెంకటేశ్ తండ్రి చనిపోయాడు. తండ్రి అంతక్రియలకు హజరయ్యేందుకు చెన్నై నుంచి రావాడానికి అనుమతి దొరకలేదు.
ఈ విషయాన్ని తన మిత్రుడు... తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ రెడ్డికి సమాచారం అందించాడు. వెంటనే జాగృతి అధ్యక్షురాలు కవితకు విషయం వివరించారు. స్పందించిన కవిత... అక్కడి ఎంపీతో మాట్లాడి పాస్ ఇప్పించారు. చెన్నై నుంచి భూపాలపల్లి వచ్చేందుకు అనుమతి ఇప్పించారు. తన తండ్రి అంతక్రియలకు హజరయ్యేందుకు సహకరించిన కవితకు, మాడ హరీశ్ రెడ్డికి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.