ETV Bharat / state

అక్షరం దిద్దిన బడిలోనే... పాఠాలు చెప్పాలని... - తెలంగాణ ఎడ్​సెట్​ వార్తలు

ఎడ్​సెట్​ ఫలితాల్లో సామాజిక శాస్త్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లికి చెందిన వెల్గం సతీశ్​ మొదటి ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి... సర్కారు బడిలో చదువుకున్న తనకు ప్రథమస్థానం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

అక్షరం దిద్దిన బడిలోనే... పాఠాలు చెప్పాలని

author img

By

Published : Oct 29, 2020, 9:53 AM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లికి చెందిన వెల్గం సతీశ్​ ఎడ్​సెట్​ ఫలితాల్లో సామాజిక శాస్త్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. సతీశ్​ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. చిన్నతనం నుంచి సర్కారు విద్యను అభ్యసించిన ఈ స్థాయికి వచ్చిన తనకు ర్యాంక్​ రావడం పట్ల సంతోషంగా ఉన్నాడు.

సతీశ్​​ ఐదోతరగతి వరకు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివాడు. పదో తరగతి గణపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. ఇంటర్​ పరకాల ప్రభుత్వ కళాశాలలో... డిగ్రీ కాకతీయ ప్రభుత్వ కళాశాలలో చదివాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఓవైపు చదువుకుంటూనే వీలైనప్పుడల్లా వ్యవసాయ పనికి వెళ్లేవాడు. సామాజిక శాస్త్రంలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడమే తన లక్ష్యమంటున్నాడు సతీశ్​.

ఇదీ చూడండి: తెలంగాణ పోలీసులకు స్కోచ్​ బంగారు పతకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.