కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో... కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద పోటేత్తుతోంది.
బ్యారేజిలోని 85 గేట్లకు గానూ 15 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 53 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా... గేట్ల ద్వారా 23,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ఇప్పటికే 11.6 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.
ఇదీ చదవండి: ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం