ETV Bharat / state

పనులు వేగంగా పూర్తి చేయాండి.. కలెక్టర్​ ఆదేశం - Collector Mohammed Abdul Azim latest news

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అజీమ్ సమావేశం నిర్వహించారు. రహదారులు, వంతెనల నిర్మాణ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Jayashankar District latest news
పనులు వేగంగా పూర్తి చేయాండి.. కలెక్టర్​ ఆదేశం
author img

By

Published : Oct 3, 2020, 5:32 PM IST

రహదారులు, వంతెనల నిర్మాణం మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్... ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో డీఎంఎప్టీ నిధులతో చేపట్టిన కొత్త రోడ్లు, వంతెనల నిర్మాణ పనుల ప్రగతి, అధిక వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునరుద్ధరణ పనులపై సమీక్షించారు.

జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్ల వంతెనల మరమ్మతు పనులను 25 గుర్తించి వాటిని బాగు చేయుటకు 5 కోట్ల 30 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇప్పటికే అన్ని పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు పూర్తిచేసి ప్రజలకు సాధారణ రవాణా కోసం ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు.

42 కోట్ల రూపాయల డీఎం అండ్ ఎఫ్​టీ నిధులతో జిల్లాలో చేపట్టిన కొత్త రహదారులు, వంతెనల నిర్మాణ పనులు 14 కలవని వాటిని కూడా రానున్న 45 రోజుల్లోగా పూర్తిచేయాలని వివరించారు.

ఇదీ చూడండి: భాజపా నేతలపై ఈసీకి తెరాస ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.