జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ సెక్టార్ 1, 2 వ గనిలోకి నీరు చేరింది. గనుల్లో నిలిచిన నీటితో 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు గంట పాటు పనులు ఆగిపోయాయి. అనంతరం యథావిధిగా పనులు కొనసాగాయి.
ఇవీ చూడండి: వాతలు వచ్చేలా కొట్టిన సైకో టీచర్