దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రజలందరి మేలు కోసం కుంకుమపూజ హోమం, లలిత సహస్రనామపారాయణం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.