భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిన్న సాయంత్రం గనిలో పైకప్పు కూలిన దుర్ఘటనలో.. కార్మికులు నర్సయ్య, శంకరయ్యలు అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను సింగరేణి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
విగతజీవులుగా ఉన్న తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గని ప్రమాదానికి సంబంధించి తమకు అధికారులు సమాచారం ఇవ్వలేదని...కుటుంబ సభ్యులు చెప్పారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా వారికి అండగా నిలిచి ఆదుకుంటుందని తెలిపారు.
ఇదీ చూడండి : దారుణం: భార్యను హతమార్చిన భర్త