జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారంలో.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, మిగతా కుటుంబ సభ్యుల బాగు కోసం ఆలోచించి.. కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలతో గిరిజన బాధితులను ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రామంలో ఇటీవల కరోనా సోకిన 14 మంది.. సమీప అటవీ ప్రాంతంలో తాత్కాలిక గుడారాలు వేసుకొని ఉంటున్నారన్న సమాచారంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తహసీల్దార్ సతీశ్.. వైద్య సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లారు. బాధితులకు నచ్చజెప్పి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఇళ్లల్లో సౌకర్యాలు లేని వారు.. ఐసోలేషన్ కేంద్రానికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీడీవో ఆంజనేయులు, వైద్యాధికారి గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Bandi Sanjay: ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపితే అరెస్టు చేస్తారా?: బండి