జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం అనే అటవీ గ్రామంలో 3 రోజుల్లోనే 34 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురికి కొవిడ్ సోకింది. ఇళ్లలో ఉంటే మరికొందరికి వైరస్ సోకుతుందన్న ఉద్దేశంతో ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది గ్రామశివారులోని అటవీ ప్రాంతాన్నే ఐసొలేషన్(Isolation)గా ఎంచుకున్నారు.

కొంత మంది అక్కడే వంట చేసుకుంటుండగా.. మరికొంత మందికి కుటుంబసభ్యులు ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారు. తమ వద్దకు అధికారులు, నాయకులు రాలేదని వారు తెలిపారు.