ETV Bharat / state

తేమ ఎక్కువుందని లోడ్​ వెనక్కి... మొక్కజొన్న రైతుల ఆందోళన

ఆరుగాలం కష్టపడి పంట పండించటం ఒక ఎత్తు అయితే... వచ్చిన దిగుబడిని అమ్ముకోవటం మరో ఎత్తు అయింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ సొసైటీలో మక్కల్లో తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేసి గోదాంకి పంపించిన లారీని తిరిగి వెనక్కి పంపించిన ఘటన నెలకొంది.

CORN FARMERS PROTEST AGAINST OFFICERS
తేమ ఎక్కువుందని లోడ్​ వెనక్కి... మొక్కజొన్న రైతుల ఆందోళన
author img

By

Published : May 3, 2020, 12:01 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని సొసైటీలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసి గోదాంకి పంపిన తర్వాత లారీని అధికారులు మళ్లీ వెనక్కి పంపించారు. రేగొండ, రంగయ్యపల్లి గ్రామాలకు చెందిన సుమారు 8 మంది రైతులు 5 రోజుల క్రితం 450 మొక్కజొన్నల బస్తాలు సొసైటీలో వేసి లారీ లోడ్ చేయించారు.

గోదాంకి వెళ్ళిన మొక్కజొన్నలో తేమ శాతం ఎక్కువ ఉందని అధికారులు వెనక్కి పంపించారు. సొసైటీకి వచ్చిన లారీని అన్​లోడ్​ చేసేందుకు హమాలీ ఛార్జీలు రైతులే చెల్లించాలన్నారు. ఎవరి బస్తాలు వారు తీసుకెళ్లాలని నిర్వాహకులు చెప్పగా.... రైతులు వాగ్వాదానికి దిగారు. మక్కల్లో తేమశాతం ఎక్కువగా ఉందని... తగ్గిన తర్వాత మళ్లీ పంపిస్తామని సొసైటీ అధికారి రైతులను బుజ్జగించారు.

ఇదీ చూడండి:దేశంలో కరోనా వైరస్​ రూపాంతరం చెందుతోందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.